ఆదివారం 29 మార్చి 2020
National - Mar 13, 2020 , 19:04:37

కోర్టు రూమ్‌లోకి లాయ‌ర్లు మాత్ర‌మే రావాలి..

కోర్టు రూమ్‌లోకి లాయ‌ర్లు మాత్ర‌మే రావాలి..

హైద‌రాబాద్‌: లాయ‌ర్లు మాత్ర‌మే కోర్టు రూమ్‌లోకి రావాల‌ని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో  ఢిల్లీలోని అత్యున్న‌త న్యాయ‌స్థానం ఈ ఆదేశాలు ఇచ్చింది.  కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసుల‌ను మాత్ర‌మే విచారిస్తామ‌ని కూడా సుప్రీం పేర్కొన్న‌ది. ఆయా కేసుల‌కు సంబంధించిన లాయ‌ర్లు మాత్ర‌మే కోర్టు రూమ్‌కు రావాల‌ని, ఇత‌రుల‌ను అనుమ‌తించ‌మ‌ని కోర్టు చెప్పింది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  logo