గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 15:33:19

ష‌హీన్‌భాగ్ నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చిస్తున్న సుప్రీం మ‌ధ్య‌వ‌ర్తులు

ష‌హీన్‌భాగ్ నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చిస్తున్న సుప్రీం మ‌ధ్య‌వ‌ర్తులు

హైద‌రాబాద్‌:  ఢిల్లీలోని ష‌హీన్‌భాగ్‌లో నిర‌స‌న చేప‌డుతున్న ఆందోళ‌న‌కారుల‌తో సుప్రీంకోర్టు నియ‌మిత మ‌ధ్య‌వ‌ర్తులు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.  సంజ‌య్ హెగ్డే, సాధనా రామ‌చంద్ర‌న్‌లు.. కాసేప‌టి క్రితం ష‌హీన్‌భాగ్ చేరుకుని నిర‌స‌న‌కారుల‌తో మాట్లాడుతున్నారు.  పౌర‌స‌త్వ స‌ర‌వ‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా గ‌త రెండు నెల‌ల నుంచి ష‌హీన్‌భాగ్‌లో ఆందోళ‌న‌కారులు ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే.  నిర‌స‌న‌కారులు రోడ్డుపైనే బైఠాయించారు.  ఈ  కేసులో విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం.. నిర‌స‌న‌కారుల‌తో మాట్లాడేందుకు ఓ క‌మిటీని వేసింది. ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారంతో స‌మ‌స్య‌ను శాంతియుతంగా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తామ‌ని అడ్వ‌కేటు సంజ‌య్ హెగ్డే తెలిపారు.  నిర‌స‌న‌ను మ‌రో చోటుకు త‌ర‌లించాల‌ని ఇటీవ‌ల సుప్రీం త‌న తీర్పులో వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. 


logo