శనివారం 06 జూన్ 2020
National - May 12, 2020 , 20:05:01

రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు సింగిల్‌ బెంచ్‌లు

రేపటి నుంచి యథావిధిగా సుప్రీంకోర్టు సింగిల్‌ బెంచ్‌లు

న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో భాగంగా గత 55 రోజులుగా నిలిచిపోయిన సుప్రీంకోర్టు కార్యక్రమాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. తొలుత సింగిల్‌ జడ్జి బెంచ్‌ల కార్యకలాపాలు నిర్వహించాలన్న నిర్ణయానికొచ్చారు. సుప్రీంకోర్టులోని మూడు సింగిల్‌ జడ్జి బెంచ్‌లు ఏడేండ్ల కన్నా తక్కువ జైలుశిక్ష, బదిలీలకు సంబంధించిన నేరాలకు బెయిల్‌ ఇచ్చే విషయాలను విననున్నాయి. ఈ నిర్ణయానికి ముందు బెంచ్‌ కనీస పరిమితిగా ఇద్దరు న్యాయమూర్తులు ఉండేవారు. న్యాయమంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం, గత ఏడాది జూలై వరకు కోర్టులో 11.5 లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కైప్‌, ఫేస్‌టైమ్‌, వాట్సాప్‌ యాప్‌ల ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్‌ చేపట్టి గత కొన్నిరోజులుగా కేసులను పరిశీలిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం  210 రోజులు కచ్చితంగా  పనిచేస్తామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే వెల్లడించారు.


logo