శుక్రవారం 10 జూలై 2020
National - Jun 22, 2020 , 18:21:42

జ‌న‌ర‌ల్ వార్డుకు ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి

జ‌న‌ర‌ల్ వార్డుకు ఢిల్లీ ఆరోగ్య‌మంత్రి

న్యూఢిల్లీ: ఢిల్లీ హెల్త్ మినిస్ట‌ర్ స‌త్యేంద‌ర్‌ జైన్ ఆరోగ్యం మెరుగుప‌డింది. ప్లాస్మా చికిత్స చేయ‌డంతో ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డింద‌ని వైద్యులు తెలిపారు. ఈ నెల 17న స‌త్యేంద‌ర్ జైన్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రిలో చేరారు. తీవ్ర జ్వ‌రం, శ్వాస‌సంబంధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఐసీయూకు త‌ర‌లించి చికిత్స అందించారు. 

అయినా పరిస్థితి మెరుగుప‌డక‌పోవ‌డంతో స‌త్యేంద‌ర్ జైన్‌కు ప్లాస్మా చికిత్స అందించారు. ప్లాస్మా చికిత్స అనంత‌రం ఆయ‌న ఆరోగ్యం మెరుగుప‌డింది. జ్వ‌రం త‌గ్గ‌డంతోపాటు, శ్వాస‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగ‌య్యింది. దీంతో సోమ‌వారం ఆయ‌న‌ను ఐసీయూ నుంచి జ‌న‌ర‌ల్ వార్డుకు త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 


logo