శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 20, 2020 , 13:56:26

స‌త్య‌మేవ జ‌య‌తే.. శివ‌రాజ్ ట్వీట్‌

స‌త్య‌మేవ జ‌య‌తే.. శివ‌రాజ్ ట్వీట్‌

హైద‌రాబాద్‌:  మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సీఎం క‌మ‌ల్‌నాథ్‌.. బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు రాజీనామా చేశారు. ఇవాళ ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను  గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు.  ఈ ప‌రిణామాల‌పై మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు.  స‌త్యమేవ జ‌య‌తే అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.  స‌త్యం గెలిచింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరిన‌ జ్యోతిరాదిత్య సింథియా కూడా ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు.  క‌మ‌ల్‌నాథ్ రాజీనామాతో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు విజ‌యం సాధించార‌ని సింథియా అన్నారు. 

రాజీనామాకు ముందు క‌మ‌ల్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.  మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌ప‌రీక్ష‌కు సిద్ద‌మ‌య్యార‌న్నారు.  బెంగుళూరులో త‌మ‌కు చెందిన 22 మంది ఎమ్మెల్యేల‌ను ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు.  కోట్లు ఖ‌ర్చు చేసి ఇలాంటి రాజ‌కీయాలు చేస్తున్న‌ట్లు ఆయ‌న విమ‌ర్శించారు. logo