ఆదివారం 29 మార్చి 2020
National - Mar 17, 2020 , 19:34:41

కరోనా వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైన సత్యసాయి ట్రస్ట్

కరోనా వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైన సత్యసాయి ట్రస్ట్

అనంతపురం: కరోనా పై భారత ప్రభుత్వం ఆదేశాలతో సత్యసాయి ట్రస్ట్ ముందస్తుగా పలు చర్యలు చేపట్టింది. బుధవారం నుండి  ప్రశాంతి నిలయానికి విచ్చేసే దేశ విదేశీ భక్తులకు వసతి సౌకర్యం ఇవ్వబడదు. నక్షత్రశాల చైతన్య జ్యోతి మ్యూజియం సనాతన సంస్కృతి మ్యూజియం మార్చి 31వ తేదీ వరకు మూసివేయనున్నారు. రెండు వారాల పాటు నిత్య అన్నదానం ఉండదు. కేవలం ఆశ్రమ వాసులకు ఆశ్రమఉద్యోగులకు సేవాదళ్ సభ్యులకు మాత్రమే ప్రశాంతి క్యాంటీన్లలో భోజనం టిఫిన్ లభిస్తుంది.

బయట వ్యక్తులకు అనుమతి లేదు. పర్తి యాత్రలు బంద్. సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యలో సభలు,సమావేశాలు నిలిపివేశారు. ట్రస్ట్ పరిధిలో ఉన్న బెంగళూరు వైట్ ఫీల్డ్ సత్య సాయి ఆశ్రమం బంద్. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులకు సెలవులు ప్రకటించారు.  ప్రశాంతి నిలయంలో సాదాసీదా కార్యక్రమాలు. సత్య సాయి సమాధి ని దూరం నుంచి నమస్కరించుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. 


logo