గురువారం 22 అక్టోబర్ 2020
National - Aug 31, 2020 , 16:39:13

డోక్లామ్ స‌మీపంలో హెలిపోర్ట్ నిర్మిస్తున్న చైనా

డోక్లామ్ స‌మీపంలో హెలిపోర్ట్ నిర్మిస్తున్న చైనా

హైద‌రాబాద్‌: డ్రాగ‌న్ దేశం స‌రిహ‌ద్దు వెంట త‌న పంథాను వీడ‌డం లేదు.  భార‌త్‌, భూటాన్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో .. హెలిపోర్ట్‌ను పీఎల్ఏ ద‌ళాలు నిర్మిస్తున్నాయి.  స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల కేంద్రాల‌ను చైనా తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలుస్తోంది.  ఉప‌గ్ర‌హ చిత్రాల ద్వారా చైనా ఆర్మీ చేస్తున్న కుట్ర‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా ఇంటెలిజెన్స్ సంస్థ డెట్రెస్‌ఫా త‌న ట్విట్ట‌ర్‌లో చైనా సైనిక ద‌ళాలు నిర్మిస్తున్న క‌ట్ట‌డాల చిత్రాల‌ను పోస్టు చేసింది. డోక్లామ్‌తో పాటు సిక్కిం సెక్టార్ల స‌మీపంలో ఆ హెలిప్యాడ్ నిర్మాణం జ‌రుగుతున్న‌ది. నాకు లా, డాక్లా పాస్‌కు 100 కిలోమీట‌ర్ల దూరంలో ఆ హెలిపోర్ట్  ఉన్న‌ది.  అన్ని త‌ర‌హాల వాతావ‌ర‌ణాన్ని త‌ట్టుకునే విధంగా నిర్మాణం సాగుతున్న‌ది. త‌మ నిఘా వ్య‌వ‌స్థ‌‌ను చైనా పెంచుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. 

అనుమానిత హెలిపోర్ట్‌లో మిస్సైల్ స‌దుపాయాల‌ను, రేడార్ వార్నింగ్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.  2017లో రెండు దేశాల మ‌ధ్య డోక్లామ్ ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న విష‌యం తెలిసిందే. 73 రోజుల పాటు అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది. ఆ ప్రాంతానికి చేరువ‌లోనే ప్ర‌స్తుతం హెలిప్యాడ్‌ను నిర్మిస్తున్నారు. అప్ప‌ట్లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో న‌లుగురు భార‌తీయ‌, ఏడుగురు చైనా జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. హెలిప్యాడ్‌, మిస్సైల్ సైట్ నిర్మాణంపై ఇంకా భార‌తీయ వ‌ర్గాలు స్పందించ‌లేదు.  


logo