మరో ఆసుపత్రికి శశికళ తరలింపు

బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలైన శశికళను గురువారం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. అక్రమాస్తుల కేసులో నాలుగేండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె బెంగళూరులోని సెంట్రల్ జైలులో ఉన్నారు. శశికళ బుధవారం జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొవడంతో సెంట్రల్ జైలు నుంచి భద్రత మధ్య నగరంలోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు కరోనా పరీక్షతోపాటు మిగతా వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షలో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు సమాచారం. మరోవైపు శశికళకు మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి గురువారం తరలించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు తరలిరాగా వారికి నమస్కరించడంతోపాటు చేయి ఊపి అభివాదం చేశారు.
కాగా, అక్రమాస్తుల కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇటీవల రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంతోపాటు మంచి ప్రవర్తన వల్ల ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో శశికళ విడుదల కానుండటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- డే అంతా ‘ఫ్రై’: నిమిషానికి రూ.1450 కోట్లు లాస్!
- క్రికెట్‌కు యూసుఫ్ పఠాన్ గుడ్‌బై
- మిషన్ భగీరథ భేష్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- ఆన్లైన్లోనే నామినేషన్లు వేయొచ్చు!
- భాగ్యశ్రీ అందానికి ఫిదా అవ్వాల్సిందే..వీడియో
- పంజాబ్‌లో కనిపించిన యూఎఫ్‌వో.. వీడియో వైరల్
- గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఇద్దరు యువకులు మృతి
- ఫైజర్ వ్యాక్సిన్ సింగిల్ డోస్‌తో వైరస్ సంక్రమణకు చెక్!
- ఐదు రాష్ట్రాల ఎన్నికలు: గంటసేపు పొలింగ్ పొడిగింపు
- సీఆర్పీఎఫ్ జవాన్లకు సైనిక హెలికాప్టర్ సదుపాయం