ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 10:45:12

నిల‌క‌డ‌గా శ‌శిక‌ళ ఆరోగ్యం

నిల‌క‌డ‌గా శ‌శిక‌ళ ఆరోగ్యం

బెంగ‌ళూరు : త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు, అన్నాడీఎంకే మాజీ నాయ‌కురాలు శ‌శిక‌ళ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని బెంగ‌ళూరు మెడిక‌ల్ కాలేజీ ఆస్ప‌త్రి వైద్యులు తెలిపారు. ఐసీయూ వార్డులో ప్ర‌త్యేక వైద్య బృందం చేత ఆమెకు చికిత్స కొన‌సాగుతోంద‌ని చెప్పారు. జ‌న‌వ‌రి 21వ తేదీన శ‌శిక‌ళ‌కు క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన విష‌యం విదిత‌మే. ఆమెకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, మధుమేహం, రక్తపోటు కూడా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అక్రమాస్తుల వ్యవహారంలో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. ఈ నెల 27న విడుదల కావాల్సి ఉన్నది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె విడుదల కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే ఇంతలో అస్వస్థతకు గురికావటం ఆమె అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నది. 


VIDEOS

logo