గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 26, 2021 , 13:27:06

నిల‌క‌డ‌గానే శ‌శిక‌ళ ఆరోగ్యం: ‌వైద్యులు

నిల‌క‌డ‌గానే శ‌శిక‌ళ ఆరోగ్యం: ‌వైద్యులు

బెంగ‌ళూరు: అనారోగ్యం కార‌ణంగా బెంగ‌ళూరు మెడిక‌ల్ కాలేజ్‌ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే మాజీ నాయ‌కురాలు వీకే శ‌శికళ ఆరోగ్య‌ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉన్న‌ద‌ని వైద్యులు తెలిపారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేశారు. శ‌శిక‌ళ ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉన్న‌ద‌ని, ఆమె త‌నంత‌ట తాను లేచి కూర్చోగ‌లుగుతున్నార‌ని, నోటి ద్వారా ఆహారం తీసుకోగ‌లుగుతున్నార‌ని వైద్యులు పేర్కొన్నారు. 

అదేవిధంగా ఇత‌రుల‌ సాయంతో శ‌శిక‌ళ నెమ్మ‌దిగా న‌డ‌వ‌గ‌లుగుతున్నార‌ని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో వెల్ల‌డించారు. ఆమెకు క‌రోనా పాజిటివ్ కూడా రావ‌డంతో కొవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ చికిత్స అందిస్తున్నామ‌ని చెప్పారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిని వైద్యుల బృందం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ద‌ని తెలిపారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo