సోమవారం 08 మార్చి 2021
National - Jan 20, 2021 , 18:19:26

శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

శశికళకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ అస్వస్థతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె బుధవారం జ్వరంతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బందికి తెలిపారు. దీంతో శశికళను భద్రత మధ్య సెంట్రల్‌ జైలు నుంచి బెంగళూరులోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

కాగా, అక్రమాస్తుల కేసులో నాలుగేండ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఇటీవల రూ.10 కోట్ల జరిమానా చెల్లించడంతోపాటు మంచి ప్రవర్తన వల్ల ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తున్నది. తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఆమె విడుదల కానుండటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo