సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 18:21:21

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఏడు రోజుల కస్టడీ

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఏడు రోజుల కస్టడీ

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో సంచలనం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సరిత్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు శుక్రవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆయనను ప్రశ్నించేందుకు తమకు అప్పగించాలని ఎన్ఐఏ కోరింది. దీంతో ఏడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తున్నట్లు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తెలిపింది. మరోవైపు బంగారం అక్రమ రవాణా కేసులో అబూబాకర్, అబ్దుల్ హమీద్‌లను కస్టమ్స్ విభాగం అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరూ మలప్పురం జిల్లాకు చెందినవారు.

కాగా, తిరువనంతపురంలోని యూఏఈ రాయబార కార్యాలయంలో ఒక సెక్యూరిటీ గార్డు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడ్ని వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న సీఎం విజయన్‌ రాజీనామా చేయాలని విపక్ష యూడీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. కాగా, ఈ నెల 27వ తేదీ నుంచి వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీసన్ శుక్రవారం మీడియాకు తెలిపారు.


logo