మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 17:49:13

చీర‌క‌ట్టులో రోబో.. చెంగుచెంగుమ‌ని న‌డుస్తూ శానిటైజ‌ర్ అందిస్తుంది!

చీర‌క‌ట్టులో రోబో.. చెంగుచెంగుమ‌ని న‌డుస్తూ శానిటైజ‌ర్ అందిస్తుంది!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో షాపింగ్ మాల్స్‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. షాపింగ్ మాల్స్ య‌జ‌మానులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ క‌స్ల‌మ‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. అందుక‌ని మ‌నుషులు లేకుండా రోబోట్ సాయంతో మాల్స్ న‌డిపిస్తున్నారు. ఒక్క మాల్స్‌లోనే కాకుండా రెస్టారెంట్లు, పార్కులు జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల‌లో రోబోలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియోలు ట్విట‌ర్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఇప్పుడు త‌మిళ‌నాడుకు చెందిన ఓ షోరూం‌లో ఒక రోబో చీర‌క‌ట్టుకొని క‌స్ట‌మ‌ర్ల‌కు ఆక‌ర్షిస్తున్న‌ది.

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో రోబోల‌ను చూశాం కాని ఇలాంటి సంప్ర‌దాయ రోబోను చూడ‌లేదు. ఎరుపు, ఆకుప‌చ్చ చీర ధ‌రించిన రోబో వినియోగదారులకు శానిటైజర్‌ను పంపిణీ చేస్తున్న ఫుటేజీని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామెన్ పంచుకున్నారు. చెంగు చెంగుమంటూ ఒక‌చోట‌ నుంచి మ‌రొక చోటుకి వెళ్తుంటే భ‌లే ముచ్చ‌టేస్తుంది. 44 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను 34 వేల మంది వీక్షించారు. వేల‌మంది రీట్వీట్లు పెడుతున్నారు. logo