సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 02:54:54

‘డ్రగ్స్‌' చాటింగ్‌ చేశా!

‘డ్రగ్స్‌' చాటింగ్‌ చేశా!

  • ఎన్సీబీ విచారణలో దీపిక అంగీకారం
  • మరికొన్ని ప్రశ్నలకు దాటవేత ధోరణి 
  • డ్రగ్స్‌ తీసుకోలేదన్న శ్రద్ధా, సారా 

ముంబై: బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతున్నది. ఈ కేసులో భాగంగా ఇటీవల సమన్లు అందుకున్న ప్రముఖ నటీమణులు దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట శనివారం హాజరయ్యారు. వేర్వేరుగా జరిగిన వీరి విచారణ ఐదు గంటలకు పైగా కొనసాగింది. 2017లో డ్రగ్స్‌కు సంబంధించి జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ గురించి దీపికను అధికారులు ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. తన మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌తో తాను డ్రగ్స్‌ గురించి చాట్‌ చేసినట్టు దీపిక ఈ సందర్భంగా ఒప్పుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది. అయితే, మరికొన్ని ప్రశ్నలకు దీపిక దాటవేత ధోరణి ప్రదర్శించటంతో ఎన్సీబీ అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు మీడియా వివరించింది. మరోవైపు, డ్రగ్స్‌ చాటింగ్‌ గురించి కరీష్మా ప్రకాశ్‌ను కూడా అధికారులు ప్రశ్నించగా.. తాను, దీపిక ఈ విషయంపై చర్చించామని ఆమె కూడా చెప్పినట్టు తెలిసింది. ఇంకోవైపు, తామెప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని విచారణ సందర్భంగా శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ చెప్పినట్టు సమాచారం. ఇదిలాఉండగా నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహర్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత క్షితిజ్‌ ప్రసాద్‌ను రెండు రోజు ల పాటు విచారించిన ఎన్సీబీ.. శనివారం అరెస్టు చేసింది. రణ్‌ జోహర్‌కు సంబంధించిన ఒక విం దుపార్టీ వీడియోకి, ఈ కేసుతో సంబంధం లేదని ఎన్సీబీ డిప్యూటీ డీజీ అశోక్‌ జైన్‌ తెలిపారు.


logo