శనివారం 04 జూలై 2020
National - Jun 29, 2020 , 01:18:12

సైబర్‌ వలలో సంజయ్‌ బారు

సైబర్‌ వలలో సంజయ్‌ బారు

  • ఢిల్లీలో రూ.24 వేలు స్వాహా

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాజీ సలహాదారు సంజయ్‌ బారు సైబర్‌ మోసానికి గురయ్యారు. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో మద్యం హోమ్‌ డెలివరీ కోసం సంజయ్‌ బారు వెతికారు. ఆన్‌లైన్‌లో దొరికిన నంబర్‌కు ఫోన్‌ చేస్తే.. తాను లా కేవ్‌ వైన్స్‌ అండ్‌ స్పిరిట్స్‌ షాప్‌ ప్రతినిధినని, మద్యం డోర్‌ డెలివరీ చేయాలంటే రూ.24 వేలు ఖర్చవుతుందని నమ్మ బలికాడు. తీరా సంజయ్‌ బారు ఆ మొత్తం నగదు ఆన్‌లైన్‌లో బదిలీ చేసిన తర్వాత సదరు వ్యక్తి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయింది. దీంతో ఆయన చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 


logo