గురువారం 09 జూలై 2020
National - Jun 28, 2020 , 14:38:17

సుశాంత్ మ‌ర‌ణంపై అంత ప్ర‌చారం ఎందుకు: స‌ంజ‌య్‌రౌత్‌

సుశాంత్ మ‌ర‌ణంపై అంత ప్ర‌చారం ఎందుకు: స‌ంజ‌య్‌రౌత్‌

ముంబై: బాలీవుడ్ న‌టుడు సుశాంత్ మరణం గురించి మీడియా అతిగా ప్ర‌చారం చేస్తున్నద‌ని శివ‌సేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్ విమ‌ర్శించారు. ఫెయిల్యూర్ కావడంవ‌ల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని, పరిశ్రమలో కొంతమంది అధిపత్యం చెలాయిస్తూ ఇత‌ర ఆత్మ‌బ‌లిదానాల‌కు కార‌ణం కావ‌డం క‌రెక్టు కాద‌ని ఆయ‌న శివ‌సేన మౌత్‌పీస్ అయిన‌ సామ్నా ఎడిటోరియ‌ల్‌లో పేర్కొన్నారు. అయితే, ప్రతి రంగంలో ప్రతిపక్షం అనేది ఉంటుందని, అందుకే ఏ రంగంలో ఉన్నా బలంగా నిలబడాలని రౌత్  అభిప్రాయ‌ప‌డ్డారు.  

న‌టుడు సుశాంత్ మరణం గురించి మీడియా నిరంతరం కవరేజ్ చేసిందని, ఒక్క మాటలో చెప్పాలంటే అత‌నికి సంబంధించిన వార్త‌ల‌తో పండుగ చేసుకున్నారని సంజ‌య్ రౌత్‌ మండిపడ్డారు. అదే ఒక‌ రైతు ఆత్మహత్య చేసుకున్నా, సైనికుడు వీరమరణం పొందినా ఇలాంటి కవరేజ్ ఎందుకివ్వరని ఆయ‌న‌  ప్రశ్నించారు. ఇక్కడ రాజేష్ సింగ్ కేసు గురించి రౌత్‌ ప్రస్తావించారు. సుశాంత్ ఆత్మహత్య గురించిన క‌వ‌రేజీ ఇక‌నైనా ఆగిపోవాలని, లేదంటే ఇదో ట్రెండ్‌గా మారుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 


 


logo