సోమవారం 30 మార్చి 2020
National - Feb 20, 2020 , 01:43:51

సీవీసీగా సంజయ్‌ కొఠారీ

సీవీసీగా సంజయ్‌ కొఠారీ
  • సీఐసీగా బిమల్‌ జుల్కా.. ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఎంపిక

న్యూఢిల్లీ: చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌(సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్‌ కొఠారీ, ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా సమాచార కమిషనర్‌ బిమల్‌ జుల్కా పేర్లను మోదీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బుధవారం ఎంపిక చేసింది. విజిలెన్స్‌ కమిషనర్‌గా సురేశ్‌ పాటిల్‌ను, సమాచార కమిషనర్‌గా అనితా పాండవ్‌ను నియమించనున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పీఎంవో, సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తదితరులతో కూడిన కమిటీలోని మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు ఈ నిర్ణ యం తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు ఈ నిర్ణయాన్ని అధిర్‌రంజన్‌ చౌదరి వ్యతిరేకించారు. వీరి ఎంపిక ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందని, వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీశ్‌ తివారీ డిమాండ్‌ చేశారు. సీవీసీని రబ్బర్‌ స్టాంప్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 


logo