న్యూఢిల్లీ: 1975 నాటి బాలీవుడ్ మూవీ షోలేలోని జబ్ తక్ హై జాన్ జానే జహన్ పాటకు ఇరాన్ మహిళ స్టెప్పులేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. మూడు భాగాలుగా ఉన్న ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశారు.
షోలే పాటకు పార్టీకి హాజరైన ఇరానియన్లు జోరుగా డ్యాన్స్ చేసిన ఈ వీడియోనెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను దేశీ ట్విటర్ యూజర్లు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ వీడియోను 76,000 మందికి పైగా వీక్షించగా ట్విటర్లో వేలాది మంది లైక్ చేశారు. ఈ పార్టీకి హజరైన వారినీ నెటిజన్లు ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు.