శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 09, 2020 , 19:14:11

రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్ సీజ్

రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్ సీజ్

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్ బాటిల్స్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు గురువారం సీజ్ చేశారు. రైసన్‌‌లోని సెహత్గంజ్ గ్రామంలో ఉన్న ఎస్‌వోఎం డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాండ్ శానిటైజర్లను తయారు చే్స్తున్నది. అయితే ఇటీవల ఎలాంటి బిల్లులు లేకుండా  14 లక్షల లీటర్ల శానిటైజర్ల బాటిళ్లను సరఫరా చేసింది. దీంతో సుమారు రూ.8 కోట్ల మేర జీఎస్టీని ఆ సంస్థ ఎగవేసింది.

దీనిపై దర్యాప్తు జరిపిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు భోపాల్, సాగర్, ఢిల్లీ, గురుగ్రామ్, సిలిగురి, కోల్‌కతా, జోధ్‌పూర్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో గత రెండు వారాలుగా తనిఖీలు చేశారు. ఆ కంపెనీకి చెందిన మరో సంస్థ గోదాంలో ఉన్న రూ.20.40 కోట్ల విలువైన శానిటైజర్లను సీజ్ చేశారు. రూ. 8 కోట్ల మేర జీఎస్టీని ఎగవేసిన నేపథ్యంలో ఎస్‌వోఎం గ్రూప్ యజమానితోపాటు ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. పలు నగరాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.logo