బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 10:44:02

రూపాయికే శానిట‌రీ ప్యాడ్స్‌.. మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

రూపాయికే శానిట‌రీ ప్యాడ్స్‌.. మోదీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం

హైద‌రాబాద్‌: పేద మ‌హిళ‌ల కోసం శానిట‌రీ ప్యాడ్ల‌ను కేవ‌లం రూపాయికే అందిస్తున్నామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు.  74వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట నుంచి ప్ర‌సంగిస్తూ ఆయ‌న మ‌హిళ అంశాన్ని ప్ర‌స్తావించారు.  జ‌నఔష‌ధ కేంద్రాల ద్వారా కేవ‌లం ఒక్క రూపాయికే శానిట‌రీ ప్యాడ్స్ ఇస్తున్న‌ట్లు మోదీ తెలిపారు.  మ‌హిళ‌ల రుతుస‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాని మాట్లాడం ప‌ట్ల సోష‌ల్ మీడియా ఆయ‌న‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ నెజిజ‌న్లు కామెంట్ పోస్టు చేస్తున్నారు. పేద కూతుళ్ల కోసం త‌మ ప్ర‌భుత్వం నిరంత‌రంగా ఆలోచిస్తున్న‌ద‌ని, సుమారు ఆరు వేల జ‌నఔష‌ధ సెంట‌ర్ల ద్వారా, దాదాపు అయిదు కోట్ల మంది మ‌హిళ‌ల‌కు కేవ‌లం రూపాయికే శానిట‌రీ ప్యాడ్స్ అందించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.   

మ‌హిళా సాధికార‌త కోసం తాము ప‌నిచేశామ‌ని, నేవీ, వైమానిక ద‌ళం.. మ‌హిళ‌ల‌ను రిక్రూట్ చేస్తున్నాయ‌ని, మ‌హిళ‌లు ఇప్పుడు నాయ‌కులు అయ్యార‌ని, ట్రిపుల్ త‌లాక్‌ను నిషేధించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  అయితే మ‌హిళల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ మాట్లాడ‌డం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో రియాక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఆ ట్వీట్ల ఇవే.. 

తాజావార్తలు


logo