ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 01:52:45

రామాలయ భూమిపూజకు ‘ఆరెస్సెస్‌' మట్టి

రామాలయ భూమిపూజకు ‘ఆరెస్సెస్‌' మట్టి

  • నాగపూర్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి అయోధ్యకు చేరవేత

నాగపూర్‌, జూలై 24: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వచ్చే 5న నిర్వహించబోయే భూమి పూజ కార్యక్రమానికి నాగపూర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం నుంచి మట్టిని పంపినట్ల్లు విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) నాయకుడు గోవింద్‌ షిండే తెలిపారు. అలాగే నాగపూర్‌ సమీపంలోని రామ్‌టెక్‌ దేవాలయం నుంచి మట్టిని, ఐదు నదులు సంగమించే చోటు నుంచి నీటిని కూడా పంపినట్లు శుక్రవారం పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించాలని తొలుత నిర్ణయించామని, అయితే కరోనా కారణంగా అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము వెళ్లగలిగే ప్రాంతాల నుంచి మట్టి, నీరు సేకరించి పంపుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ పునాదిరాయి వేయనున్నారు. 


logo