బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 10:13:49

పూరీ బీచ్‌లో ఆక‌ట్టుకుంటున్న సైక‌త‌ రామ‌మందిరం..

పూరీ బీచ్‌లో ఆక‌ట్టుకుంటున్న సైక‌త‌ రామ‌మందిరం..

హైద‌రాబాద్‌:  రామ‌న‌గ‌రం అయోధ్య అత్యంత సుంద‌రంగా ముస్తాబైంది.  దీపాల వెలుగుల‌తో ఆ న‌గ‌రం దేదీప్య‌మానంగా వెలుగుతోంది. ఇక స‌ర‌యూ న‌ది తీరం కూడా ఆక‌ర్ష‌ణీయంగా త‌యారైంది.  పువ్వులు, ఆర్ట్ వ‌ర్క్‌ల‌తో తీరం అంతా సుంద‌ర ప్ర‌దేశంగా క‌నువిందు చేస్తోంది.  రాముడి చ‌రిత్ర‌కు సంబంధించిన పెయింటింగ్స్ కూడా ఆక‌ట్టుకుంటున్నాయి. నేపాల్‌ నుంచి రిలీజైన నీటితో స‌ర‌యూ న‌ది క‌ళ‌క‌ళ‌లాడుతున్న‌ది.  భూమి పూజ కోసం అయోధ్య న‌గ‌రం మొత్తం అంద‌చందాల‌తో అల‌రిస్తున్న‌ది.  ఇక పూరీ బీచ్‌లోని సైక‌త శిల్పి సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ కూడా త‌న క‌ళాత్మ‌క ప్ర‌ద‌ర్శించారు. అయోధ్య‌లో నిర్మించ‌నున్న రామాల‌యానికి చెందిన డిజైన్‌ను పూరీ బీచ్‌లో సైక‌త శిల్పం రూపంలో వేశారు.  జైశ్రీరామ్ అన్న నినాదాంతో అద్భుత‌మైన రంగుల్లో ఆల‌య డిజైన్ చేశారు. logo