మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 22:56:53

భారీగా పుంజుకున్న శాంసంగ్

భారీగా పుంజుకున్న శాంసంగ్

ముంబై : మార్చితో ముగిసిన క్వార్టర్‌లో షియోమీ 30 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వివో 17 శాతం, రియల్‌మి 14 శాతం, ఒప్పో 12 శాతం మార్కెట్ వాటాతో నిలిచాయి. అంతకుముందు 16 శాతంతో మూడో స్థానంలో శాంసంగ్ జూన్ క్వార్టర్ నాటికి పుంజుకుని 26 శాతం మార్కెట్ షేర్‌తో రెండో స్థానంలోకి వచ్చింది. రూ.30,000కు పైగా ధర కలిగిన ఖరీదైన ఫోన్ల విషయానికి వస్తే వన్ ప్లస్ మొదటి స్థానంలో, రూ.45,000 ధర కలిగిన అత్యంత ఖరీదైన ఫోన్లలో యాపిల్‌ది అగ్రస్థానం. ఫీచర్ ఫోన్స్ విభాగంలో ఐటెల్ 24 శాతం, లావా 23 శాతం, శాంసంగ్ 22 శాతం, నోకియా 9 శాతం, కార్బన్ 5 శాతం వాటాలు కలిగి ఉన్నాయి.


logo