బుధవారం 03 జూన్ 2020
National - May 11, 2020 , 15:17:35

ప్రీ-బుక్‌ ఆఫర్లను పొడిగించిన శాంసంగ్‌..15శాతం క్యాష్‌బ్యాక్‌

ప్రీ-బుక్‌ ఆఫర్లను పొడిగించిన శాంసంగ్‌..15శాతం క్యాష్‌బ్యాక్‌

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నిర్మూలనకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఎలక్ట్రానిక్‌ షోరూంలను మూసివేసిన విషయం తెలిసిందే. ఐతే కొద్దిరోజుల నుంచి కేంద్రం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తుండటంతో షోరూంలు, వాణిజ్య కార్యాకలాపాలు ప్రారంభమయ్యాయి.  లాక్‌డౌన్‌ను ఎత్తిసిన వెంటనే ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్..టీవీ, రిఫ్రిజిరేటర్‌, వాషింగ్ మిషన్, ఎయిర్ కండీషనర్ తదితర  గృహోపకరణాలు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ శాంసంగ్‌  సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి విదితమే. 

‘స్టే హోమ్. స్టే హ్యాపీ.. లాగ్‌ ఇన్‌ టు గ్రేట్‌ ఆఫర్స్‌' పేరుతో ఆన్‌లైన్‌  ప్రీ బుకింగ్ ఆఫర్స్‌ అందిస్తున్నది.    https://www.samsung.com/in/offer/online/ce-sale/ వెబ్‌సైట్‌ ద్వారా కావాల్సిన శాంసంగ్‌ ఉత్పత్తులను బుక్‌ చేసుకోవచ్చు.  ఈ ఆఫర్‌ గడువు ఈనెల 8వ తేదీతో  ముగిసినప్పటికీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు పెరగడంతో మే 17వరకు ప్రత్యేక ఆఫర్‌ను పొడిగించింది. 

వేసవి కాలంలో ఎండలు మండుతుండటంతో మొత్తం ఆర్డర్లలో రిఫ్రిజిరేటర్ల నుంచి 37 శాతం ఆర్డర్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది. ఆ తర్వాత 21శాతం ఆర్డర్లు టీవీల నుంచి వచ్చినట్లు వివరించింది.  శాంసంగ్ షాపులో ప్రీ-బుకింగ్ చేసే వినియోగదారులకు హెచ్‌డిఎఫ్‌సి డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే  నో కాస్ట్‌ ఈఎంఐ, దీర్ఘకాలిక ఫైనాన్స్ సదుపాయం 18 నెలల వరకు ఉంది. 


logo