ఆదివారం 05 జూలై 2020
National - Jun 26, 2020 , 22:33:19

లక్నోలో పెట్రోల్‌ ధర పెంపుపై నిరసన

లక్నోలో పెట్రోల్‌ ధర పెంపుపై నిరసన

లక్నో : పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలో సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయగా పోలీసులు అడ్డుకొని వారి అదుపులోకి తీసుకున్నారు. గడిచిన 20రోజుల్లో  లక్నోలో పెట్రోల్‌ ధర లీటర్‌కు 80రూపాయలు దాటిందని సమాజ్‌వాది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై రూ. 21 పైసలు పెంచడంతో 80.13రూపాయలకు చేరిందని, డీజిల్‌పై 17పైసల పెంపుతో లీటర్‌ ధర రూ.80.19 పైసలకు చేరింది. ఇంధన ధరలను పెంచి బీజేపీ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆక్షేపించారు. పెంచిన ధరలను తక్షణం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కాగా పెట్రోల్‌ ధర పెంపులో ఆయా రాష్ర్టాల విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఆధారంగా తేడాలుంటాయి. రాష్ట్ర పరిధిలోని ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలు వారి మార్కెట్‌ మార్జిన్‌కు అనుగుణంగా ధరలను సర్దుబాటు చేసుకునే అవకాశముంది.


logo