శనివారం 04 జూలై 2020
National - Jul 01, 2020 , 08:02:13

వారి భక్తికి, త్యాగానికి దేశం నమస్కరిస్తుంది : అమిత్‌ షా

వారి భక్తికి, త్యాగానికి దేశం నమస్కరిస్తుంది : అమిత్‌ షా

ఢిల్లీ : నేడు డాక్టర్స్‌ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. కోవిడ్‌-19 మహమ్మారిపై యుద్ధంలో ముందుంజలో ఉండి పోరాడుతున్న ధైర్యవంతులైన వైద్యులకు తను వందనాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఛాలెంజ్‌ సమయాల్లో దేశాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి వారి నిబద్ధత నిజంగా అసాధారణం అన్నారు. వారి దేశ భక్తికి, వారు చూపిస్తున్న త్యాగానికి దేశం నమస్కరిస్తుందని ఆయన పేర్కొన్నారు. 


logo