ఆదివారం 07 జూన్ 2020
National - Mar 29, 2020 , 00:30:16

మీ నిబద్ధతకు జోహార్‌

మీ నిబద్ధతకు జోహార్‌

భోపాల్‌: కరోనాతో దేశం అల్లాడుతున్న క్లిష్ట సమయంలో కుటుంబ బాంధవ్యాలను, భావోద్వేగాల్ని పక్కనబెట్టి ప్రజల కోసం పని చేస్తున్న వాళ్లు ఎందరో. ఇలాంటి కోవకే చెందిన వారు అష్రఫ్‌ అలీ, ఇర్ఫాన్‌ ఖాన్‌. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని ‘భోపాల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌'లో వీళ్లు ఉద్యోగులు. పారిశుద్ధ్యం విభాగంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అలీ బుధవారం కరోనా నేపథ్యంలో అత్యవసర విధుల్లో ఉన్నప్పుడు.. తన తల్లి చనిపోయిందన్న వార్త తెలిసింది. అయినా విధులు అయిపోయిన తర్వాత తన తల్లి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. మరో ఘటనలో.. ఇదే కార్పోరేషన్‌లో డాటా మేనేజర్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే అధికారికి సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కుడి చేయి విరిగింది. విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పినప్పటికీ ఆయన విధుల్లోకి హాజరయ్యారు. 


logo