నవంబర్‌లో పెరిగిన ట్రాక్టర్ల సేల్స్ ... ఎంతంటే..?

ఢిల్లీ: కరోనా నేపథ్యంలో అన్-లాక్ తర్వాత పలు రంగాలు కాస్త వృద్ధి కనిపించింది. ముఖ్యంగా వ్యవసాయ వృద్ధి ఆశాజనకంగా ఉన్నది. నవంబర్ నెలలో ట్రాక్టర్ సేల్స్ పెరిగాయి. ఫామ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ ఎస్కార్ట్ అగ్రి మిషనరీ సేల్స్ పెరిగాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్లు 2019 నవంబర్ నెలలో 7,642 యూనిట్లు కాగా, ఈ నవంబర్‌లో 33 శాతం పెరిగి 10,165గా నమోదయ్యాయి. సేల్స్ పెరగడంతో డీలర్స్, డిపోలో స్టాక్స్ క్షీణించాయి. రానున్న నెలల్లోను సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు.
2019 వంబర్ నెలలో ఎస్కార్ట్ ట్రాక్టర్ సేల్స్ డొమెస్టిక్ 7,379, ఎగుమతులు 263 కాగా, ఈ ఏడాది నవంబర్ నెలలో డొమెస్టిక్ 9,662 యూనిట్లు, ఎగుమతులు 503కు పెరిగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 56 శాతం ఎగిశాయి. గత ఏడాది నవంబర్ నెలలో మహీంద్రా ట్రాక్టర్ సేల్స్ 21,031 కాగా, ఈ నవంబర్ నెలలో ఏకంగా 32,726కు పెరిగాయి. డొమెస్టిక్ సేల్స్ గత ఏడాది 20,414 కాగా, ఈ నవంబర్ నెలలో 31,619కి పెరిగాయి. ఎగుమతులు 1,107 యూనిట్లుగా నమోదయ్యాయి.
అశోక్ లేలాండ్ సేల్స్ 5 శాతం పెరిగాయి...
అశోక్ లేలాండ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 5 శాతం పెరిగాయి. మీడియం, హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ మాత్రం 14 శాతం పెరిగాయి. మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికిల్ సేల్స్ గత ఏడాది నవంబర్ నెలలో 5,966 యూనిట్లు కాగా, ఈ నవంబర్ నెలలో 5,114కు పడిపోయాయి. 14 శాతం క్షీణించాయి. లైట్ కమర్షియల్ వెహికిల్ సేల్ 4,209 యూనిట్ల నుండి 32 శాతం పెరిగి 5545 యూనిట్లకు పెరిగాయి. మొత్తంగా సేల్స్ 10,175 (2019) నుండి 5 శాతం పెరిగి 10659కు పెరిగాయి.
పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు...
మహీంద్రా అండ్ మహీంద్రా పాసింజర్ వెహికిల్ సేల్స్ 2019 నవంబర్ నెలలో 14637 కాగా, 24 శాతం పెరిగి 18212 యూనిట్ల మేర పెరిగాయి. కమర్షియల్ వెహికిల్ సేల్స్ 42 శాతం తగ్గి 6593 నుండి 3854 యూనిట్లకు క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎగుమతులు 2019లో 2621 యూనిట్లు కాగా, 38 శాత తగ్గి 2020 నవంబర్ నెలలో 1636 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఫామ్ ఎక్విప్మెంట్స్ గత ఏడాది 21031 యూనిట్లు కాగా, 56 శాతం పెరిగి 32726 యూనిట్లకు పెరిగాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..
- ప్రధాని చెప్పారు.. ఈటల పాటించారు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక బస్‌పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్‌లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ