బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 17:40:43

కేరళలో మద్యం అమ్మకాలు షురూ!

కేరళలో మద్యం అమ్మకాలు షురూ!

తిరువనంతపురం: కేరళలో మద్యం అమ్మకాలు త్వరలో ప్రారంభమవనున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 301 వైన్‌ షాపులను తొందర్లోనే ప్రారంభిస్తామని, బీర్‌పై పది శాతం, ఇతర రకాల మద్యంపై 35 శాతం పన్నులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎక్సైజ్‌ శాఖ మంత్రి టీపీ రామకృష్ణన్‌ ప్రకటించారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో రాబడులు పూర్తిగా తగ్గాయని, ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన చెప్పారు. వైన్‌ షాపులముందు రద్దీని నిలువరించడానికి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుంటామని, షాప్‌ వద్ద వాటిని అందిస్తామని వెల్లడించారు.


logo