బుధవారం 08 జూలై 2020
National - Apr 30, 2020 , 17:56:56

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

రిలయన్స్‌ ఉద్యోగుల జీతాల్లో కోత

ముంబై: దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కరోనా సంక్షోభంతో తన ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది. ఉద్యోగుల వేతనాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వార్షిక వేతనం రూ.15 లక్షలు కంటే తక్కువున్న వారికి కోతలు ఉండవని, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10 శాతం కోత విధిస్తున్నట్లు  వెల్లడించింది. బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు, సీనియర్‌ లీడర్ల వేతనాల్లో  30 నుంచి 50 శాతం కోత విధించింది. కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ తన వార్షిక పారితోషికాన్ని పూర్తిగా వదులుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది.


logo