ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 12:07:06

వీర సైనికులకు సలాం : కోహ్లీ

వీర సైనికులకు సలాం : కోహ్లీ

భారత్, చైనా మధ్య జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన భారత జవాన్లకు సెలబ్రెటీలతో పాటు క్రికెటర్లు సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ‘ గాల్వన్‌లో మన దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు నా నమస్కారం. సైనికుడి కంటే ఏ ఒక్కరూ ధైర్యంగా, నిస్వార్థంగా లేరు.  వారి కుటుంబాలకు హృదయ పూర్వక సంతాపం తెలుపుతున్నా. ఈ క్టిష్ల సమయంలో వారు మా ప్రార్థనల వల్ల శాంతిని పొందుతారని ఆశిస్తున్నా’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశారు. 

‘నిజమైన హీరోలకు నా సెల్యూట్‌. వీర మరణం పొందిన వారు మా సరహద్దును రక్షించి, మమ్మల్ని గౌరవించారు. భగవంతుడు వారి కుటుంబాలకు బలాన్ని చేకూర్చాలి’అని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ట్వీట్‌ చేశారు. 

‘ మీ త్యాగాలను దేశం ఎన్నటీకి మర్చిపోదు. భారత ఆర్మీ ఆఫీసర్‌ మరియు ఇద్దరు జవాన్లకు హృదయ పూర్వక సంతాపం. మీ ధైర్యానికి నమస్కారం. జైహింద్‌!’అని శిఖర్‌ దావన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

logo