మంగళవారం 07 జూలై 2020
National - Apr 03, 2020 , 15:08:06

ఖజానాను ఖాళీ చేసి ఎన్నికల ముందు పంచేశారు!

ఖజానాను ఖాళీ చేసి ఎన్నికల ముందు పంచేశారు!

అమరావతి: ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కరోనా విస్తరిస్తోన్న సమయంలోనూ ప్రభుత్వాన్ని టీడీపీ అప్రదిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తోందని వైసీపీ  సీనియర్‌ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడారు. 

'చంద్రబాబు వ్యాఖ్యలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా మా ప్రభుత్వమే చెల్లించింది.  ఉద్యోగ సంఘాలతో మాట్లాడాకే ఈ నెల జీతం వాయిదా పద్ధతిలో చెల్లించాలని నిర్ణయించాం.  కరోనా ప్రభావంతో రాష్ట్రంపై అదనంగా ఆర్థికభారం పడింది.  ప్రధాని నరేంద్రమోదీతో సమావేశంలో సీఎం జగన్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలిపారు. రాష్ట్రంపై అప్పుల భారం పడేసింది చంద్రబాబే. ఖజానాను ఖాళీ చేసి ఎన్నికల ముందు పంచేశారు. 60వేల కోట్ల  బిల్లులు  పెండింగ్‌ పెట్టారు. కొత్త ప్రభుత్వానికి ఖాళీ ఖజానా అప్పజెప్పిందని' సజ్జల మండిపడ్డారు. 


logo