శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 12:30:45

ప్రేమను తిరస్కరించినందుకు కాల్పులు..

ప్రేమను తిరస్కరించినందుకు కాల్పులు..

గుంటూరు : చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనిక ఉద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. రమాదేవి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ బాలాజీ వెంటపడుతున్నాడు. బాలాజీ ప్రేమను ఆమె కూతురు తిరస్కరించింది. దీంతో బాలాజీ ఇవాళ ఉదయం రమాదేవి ఇంటికి చేరుకుని నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. తుపాకీని చూసి రమాదేవి అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. రమాదేవి కుడి చెవి మీదుగా తూటా దూసుకుపోయింది. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలాజీ పరారీలో ఉన్నాడు. ఆయనకు సహకరించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.


logo