శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 15:11:08

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సంద‌ర్భంగా టీటీడీ ఈవో  అనిల్‌కుమార్‌ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి, తెలియక జ‌రిగిన‌ దోషాల నివార‌ణ‌కు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ చర్యలో  భాగంగా ఈ ఉత్సవాలను ఆల‌యంలో మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో చినజీయర్‌స్వామి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హ‌రీందర్ నాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.logo