గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 15:48:05

అమర జవాన్లకు ప్రధాని, ముఖ్యమంత్రులు నివాళి

అమర జవాన్లకు ప్రధాని, ముఖ్యమంత్రులు నివాళి

న్యూఢిల్లీ:  చైనాతో సరిహద్దు వివాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్‌ శాంతిని కోరుకుంటోందని ప్రధాని తెలిపారు. సరిహద్దులో  చైనాతో ఘర్షణలో  అమరులైన సైనికులను స్మరిస్తూ ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా, 15 రాష్ట్రాల  సీఎంలు మౌనం పాటించారు.  భారత అమర జవాన్లకు ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రులు నివాళులర్పించారు.  భారత ప్రధాని   చైనాను గట్టిగా హెచ్చరించారు. 

'సైనికుల త్యాగాలను ఎన్నటికీ మరువలేం. భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం అత్యంత ప్రాధాన్యతాంశాలు. సైనికుల త్యాగాలు వృథాగా పోవని దేశానికి హామీ ఇస్తున్నా.  భారత్‌ ఎలాంటి వివాదాలను కోరుకోదు. రెచ్చగొడితే సైలెంట్‌గా ఉండబోం. దీటుగా బదులిచ్చే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గం.  ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని' మోదీ పేర్కొన్నారు.

రెండోరోజూ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభానికి ముందు మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికుల త్యాగాలను స్మరిస్తూ అందరూ 2 నిమిషాలు మౌనం పాటించారు. logo