శనివారం 04 జూలై 2020
National - Jun 21, 2020 , 16:45:56

అటు ఫాదర్స్‌ డే.. ఇటు యోగా

అటు ఫాదర్స్‌ డే.. ఇటు యోగా

న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఫాదర్స్‌ డే సందర్భంగా ఆదివారం మాజీ ఇండియన్‌ క్రికెటర్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన నివాసంలో తన పిల్లలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ చిత్రాలను ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసి ‘కలిసి యోగా చేయడం ద్వారా ఈ సారి ఫాదర్స్‌ డేను జరుపుకున్నాం’ అంటూ ఆ చిత్రానికి ఆయన ట్యాగ్‌ లైన్‌ జోడించారు. అంతకుముందు ఆయన తండ్రితో దిగిన పాత ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఓ గొప్ప వ్యక్తిగా తాను తన తండ్రిని ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటానని ‘మొదటి ఓ మంచి వ్యక్తిగా ఉండండి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ’ పేర్కొన్నాడు. కాగా ఈ రోజు 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంట్లోనే యోగా- కుటుంబంతో యోగా నినాదంతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


logo