బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 11:43:43

స‌చిన్ పైల‌ట్ ఆఫీసు మూసివేత‌

స‌చిన్ పైల‌ట్ ఆఫీసు మూసివేత‌

జైపూర్ : రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్ కార్యాల‌యాన్ని ఆదివారం మూసివేశారు. ఆ ఆఫీసులో ప‌ని చేస్తున్న ఇద్ద‌రు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో కార్యాల‌యాన్ని మూసివేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. పైల‌ట్ నేతృత్వం వ‌హిస్తున్న పంచాయ‌తీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాల‌యాల‌ను కూడా రెండు రోజుల పాటు సీజ్ చేశారు. 

రాజ‌స్థాన్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 24,392 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 510 మంది మ‌ర‌ణించారు. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 644 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 

ఇక సీఎం అశోక్ గెహ్లాట్ క‌రోనా వైర‌స్ సంక్షోభంతో పాటు రాజ‌కీయ  సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పైల‌ట్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  సీఎం ఇచ్చిన నోటీసుల‌ను అవ‌మాన‌క‌రంగా భావించిన స‌చిన్ పైల‌ట్‌.. గెహ్లాట్‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించారు. త‌న‌కు 30 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉందంటూ స‌చిన్ పైల‌ట్ పేర్కొన్నారు.


logo