శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 06:45:45

మ‌లింగ‌కు స‌చిన్ లీగ‌ల్ నోటీస్‌

మ‌లింగ‌కు స‌చిన్ లీగ‌ల్ నోటీస్‌

జైపూర్‌: త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మ‌లింగ‌కు మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ పైల‌ట్ లీగ‌ల్ నోటీసు ఇచ్చారు. రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తిరుగ‌బాటు చేసిన స‌చిన్.. ప్ర‌భుత్వాన్ని ప‌‌తనం అంచున నిల‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో స‌చిన్ పైల‌ట్ త‌న‌ను పార్టీ మారాల‌ని, బీజేపీలో చేరాల‌ని సూచించార‌ని, ఇందుకుగాను రూ. 35 ఇస్తాన‌ని చెప్పార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. గెహ్లాట్ ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి గ‌త డిసెంబ‌ర్ నుంచి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, ఈ విష‌యంపై స‌చిన్ త‌న‌తో మూడుసార్లు సంప్ర‌థింపులు జ‌రిపార‌ని సోమ‌వారం మీడియాకు వెల్ల‌డించారు. అయితే తాను దానికి ఒప్పుకోలేద‌ని, వెంట‌నే సీఎం గెహ్లాట్‌కు ఈ విష‌యం చెప్పాన‌ని తెలిపారు. 

కాగా, ఈ ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేసిన స‌చిన్ పైల‌ట్‌, అవి నిరాధారమైనవ‌ని, అస‌త్యమ‌ని ప్ర‌క‌టించారు. రూ.35 కోట్లు ఇవ్వ‌జూపాడ‌ని త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేసిన ఎమ్మెల్యే గిరిరాజ్‌కు స‌చిన్ లీగ‌ల్ నోటీసులు పంపించిన‌ట్లు ఆయ‌న స‌న్నిహితులు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వంపై తిరుగుబాటు చెసిన స‌చిన్ పైల‌ట్ స‌హా, 18 ఎమ్మెల‌కు అసెంబ్లీ స్పీక‌ర్‌ అన‌ర్హ‌త నోటీసులు జారీచేశారు. దీంతో తిరుగుబాటు వ‌ర్గం ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్ర‌యించారు.  


logo