సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 03, 2020 , 01:42:46

పైలట్‌ స్పందిస్తేనే..

పైలట్‌ స్పందిస్తేనే..

  • చర్చలు సచిన్‌పైలెటే మొదలుపెట్టాలి
  • అప్పుడే ఆయనను తిరిగి ఆహ్వానిస్తాం
  • రాజస్థాన్‌ ప్రభుత్వానికి ఢోకాలేదు: కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో సీఎం అశోక్‌గెహ్లాట్‌పై తిరుగుబాటుచేసిన సచిన్‌పైలట్‌పై వత్తిడి పెంచే చర్యలను కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తున్నది. సచిన్‌పైలట్‌ ముందుగా మౌనం వీడి చర్చలకు వస్తే తిరిగి ఆయనను ఆహ్వానించే విషయాన్ని ఆలోచిస్తామని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సుర్జేవాలా తెలిపారు. ‘సచిన్‌పైలట్‌ ముందుకు వచ్చి చర్చలు మొదలుపెట్టాలి. ఆయన ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెప్పాలి’ అని ఆదివారం ఆయన పేర్కొన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వాని ఎలాంటి ఢోకా లేదని, ఈ నెల 14న జరిగే శాసనసభ సమావేశాల్లో బలం నిరూపించుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వానికి 102కంటే ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని ప్రకటించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేసినందువల్లనే సీఎం గెహ్లాట్‌ తిరుగుబాటు నేతలపై తీవ్రమైన విమర్శలు చేశారని వివరణ ఇచ్చారు.


logo