మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 18:42:05

రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌కు స‌చిన్ పైల‌ట్ అభినంద‌న‌

రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్‌కు స‌చిన్ పైల‌ట్ అభినంద‌న‌

జైపూర్‌: రాజస్థాన్ కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడు గోవింద్ సింగ్ దోతస్రాకు స‌చిన్ పైల‌ట్ అభినంద‌న‌లు తెలిపారు. ఎటువంటి ఒత్తిడి లేదా పక్షపాతం లేకుండా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. బుధ‌వారం ఈ మేర‌కు స‌చిన్ పైల‌ట్ ట్వీట్ చేశారు.  ‘రాజ‌స్థాన్ కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన దోత‌స్రాజీకి అభినంద‌న‌లు. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కృషి చేసిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎటువంటి ఒత్తిడి, ప‌క్ష‌పాతం లేకుండా పూర్తిగా గౌరవిస్తార‌ని ఆశిస్తున్నాను’ అని అందులో పేర్కొన్నారు. 

సీఎం అశోక్ గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన స‌చిన్ పైల‌ట్‌ను డిప్యూటీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి ఈ నెల 14న పార్టీ హైక‌మాండ్ తొల‌‌గించింది. ఆయ‌న స్థానంలో గోవింద్ సింగ్ దోత‌స్రాను రాజ‌స్థాన్ పీసీసీ అధ్య‌క్షుడిగా అదే రోజున‌ నియ‌మించింది. ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో క‌లిసి కుట్ర‌ప‌న్నుతున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో స‌చిన్ పైల‌ట్‌తోపాటు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న 18 ఎమ్మెల్యేల‌పై కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త వేటు వేయ‌గా వారు కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.logo