గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 21:11:54

నా మీద బుర‌ద‌జ‌ల్లే కుట్ర‌: స‌చిన్ పైల‌ట్‌

నా మీద బుర‌ద‌జ‌ల్లే కుట్ర‌: స‌చిన్ పైల‌ట్‌

జైపూర్‌: రాజ‌స్థాన్‌లో రాజ‌కీయ అనిశ్చితి ఇంకా కొన‌సాగుతున్న‌ది. అధికార కాంగ్రెస్ పార్టీలోని బ‌హిష్కృత నేత‌ స‌చిన్ పైల‌ట్‌ వ‌ర్గం, సీఎం అశోక్‌గెహ్లాట్ వ‌ర్గం మ‌ధ్య ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల ప‌ర్వం న‌డుస్తున్న‌ది. తాజాగా రాజ‌స్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ స‌చిన్‌పై తీవ్ర ఆరోపణ చేశారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డితే రూ.35 కోట్లు ఇస్తానంటూ స‌చిన్ పైల‌ట్ త‌న‌కు ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని ఆరోపించారు. 

అయితే ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ ఆరోప‌ణ‌ల‌ను స‌చిన్ పైల‌ట్ కొట్టిపారేశారు. గెహ్లాట్ వ‌ర్గం చేస్తున్న నిరాధార‌, అసంబ‌ద్ధ ఆరోప‌ణ‌లు త‌న‌కు ఎలాంటి ఆశ్చ‌ర్యం క‌లిగించ‌లేదుగానీ, బాధ క‌లిగించాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. రాజ‌స్థాన్ కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా తాను లేవ‌నెత్తిన న్యాయ‌బ‌ద్ధ‌మైన అంశాల‌ను క‌నుమ‌రుగు చేసేందుకు త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని పైల‌ట్ విమ‌ర్శించారు. నా ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేందుకు గెహ్లాట్ వ‌ర్గం మూకుమ్మ‌డిగా దాడి చేస్తున్న‌ద‌ని ఆయ‌న ఆరోపించారు.              

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo