సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 11:11:23

బీజేపీలో చేరి 45 ఏళ్ల‌కే ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నారు..

బీజేపీలో చేరి 45 ఏళ్ల‌కే ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నారు..

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు ప్ర‌క‌టించిన మాజీ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌పై మాజీ కాంగ్రెస్ నేత మార్గ‌రెట్ అల్వా విమ‌ర్శ‌లు చేశారు.  స‌చిన్ పైల‌ట్ చాలా తొంద‌ర‌ప‌డుతున్నార‌ని, బీజేపీలో చేరి 45 ఏళ్ల‌కే ప్ర‌ధాని కావాల‌నుకుంటున్న‌ట్లు ఆమె విమ‌ర్శించారు. యావ‌త్ దేశం కోవిడ్‌19తో పోరాడుతున్న ద‌శ‌లో, చైనాతో ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన సంద‌ర్భంలో.. స‌చిన్ పైల‌ట్ చేప‌ట్టిన తిరుగుబాటు సరైంది కాదు అని మార్గ‌రేట్ అల్వా అన్నారు. రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింద‌ని, గెహ్లాట్‌కు డిప్యూటీగా పైల‌ట్ నియ‌మితుల‌య్యార‌ని, ఆయ‌న‌కు నాలుగు కీల‌క ప‌ద‌వులు ఇచ్చార‌ని, పీసీసీ చీఫ్ కూడా అయ్యార‌ని, ఆ ద‌శ‌లో పైల‌ట్ తిరుగుబాటు చేయ‌డం దారుణ‌మ‌ని అల్వా అన్నారు. 

26 ఏళ్ల‌కే స‌చిన్ పైల‌ట్ ఎంపీ అయ్యార‌ని, ఆ త‌ర్వాత‌ కేంద్ర మంత్రి అయ్యార‌ని, ఆ త‌ర్వాత పీసీసీ చీఫ్ అయ్యార‌ని, ఇక డిప్యూటీ సీఎం కూడా అయ్యార‌ని, ఇంత త్వ‌ర‌గా ఎక్క‌డికి వెళ్లాల‌నుకుంటున్నారని ఆమె  ప్ర‌శ్నించారు. 43 ఏళ్ల‌కే ముఖ్య‌మంత్రిని అవుదామ‌నుకుంటున్నారా,  బీజేపీ చేరి 45 ఏళ్ల‌కే ప్ర‌ధాని కావాల‌నుకుంటున్నావా అంటూ మార్గ‌రేట్ అల్వా విమ‌ర్శించారు.  logo