మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 11:49:43

భార‌త్‌లో వ‌ర‌దలు.. పుతిన్ సంతాపం

భార‌త్‌లో వ‌ర‌దలు.. పుతిన్ సంతాపం

మాస్కో: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ‌ర‌దల‌ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన‌వారికి ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాని మోదీకి పంపిన సందేశంలో పుతిన్ త‌న ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తంచేశార‌ని ర‌ష్యా అధ్య‌క్ష కార్యాల‌యం ప్ర‌క‌టించింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో వ‌ర‌ద‌లు సంభ‌వించి ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం విశాద‌క‌ర‌మ‌ని, గాయ‌ప‌డిన‌వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పుతిన్ ఆకాంక్షించారు.   

అసోంలో కురుస్తున్న వాన‌ల‌తో పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు రావ‌డంతో బార్పెటాలో మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో వ‌ర‌ద‌ల‌ వ‌ల్ల మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 89కు చేరింది. మొత్తం 33 జిల్లాల్లో 26 జిల్లాల్లో 26.32 ల‌క్ష‌ల మంది వ‌ర‌ద‌ల ప్ర‌భావిత‌మ‌య్యార‌ని విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ అధికారులు ప్ర‌క‌టించారు.


logo