శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Sep 04, 2020 , 14:24:12

పాక్‌కు ఎదురుదెబ్బ.. ఆయుధాలు అమ్మేదిలేదన్న రష్యా

పాక్‌కు ఎదురుదెబ్బ.. ఆయుధాలు అమ్మేదిలేదన్న రష్యా

హైద‌రాబాద్‌:  పాకిస్థాన్‌కు ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసేది లేద‌ని ర‌ష్యా మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.  ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. ఇవాళ ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోయిగితో భేటీ అయ్యారు. మాస్కోలో ఉన్న ర‌క్ష‌ణ మంత్రి కార్యాల‌యంలో ఇద్ద‌రూ భేటీ అయ్యారు. అక్క‌డ వారు గంట‌సేపు వివిధ అంశాల గురించి చ‌ర్చించారు. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసే అంశంపై ర‌ష్యా స్పందించిన‌ట్లు తెలుస్తోంది. పాక్‌కు ఆయుధాలు అమ్మ‌డం లేద‌ని ర‌ష్యా స్ప‌ష్టం చేసింది. భార‌త్ అభ్య‌ర్థ‌న మేర‌కు ర‌ష్యా ఈ క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

మాస్కోలో ఉన్న సైనిక ద‌ళాల క్యాథ‌డ్ర‌ల్‌ను రాజ్‌నాథ్ సంద‌ర్శించారు.  మ్యూజియం కాంప్లెక్స్‌ను కూడా ఆయ‌న విజిట్ చేశారు.  మూడు రోజుల ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాజ్‌నాథ్‌ ..  చైనా ర‌క్ష‌ణ‌మంత్రితోనూ భేటీ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. గ‌తంలో అర‌డ‌జ‌ను హెలికాప్ట‌ర్ల‌ను పాకిస్థాన్‌కు ర‌ష్యా అమ్మేసింది. కానీ భార‌త్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో స‌ర‌ఫ‌రాను ఆపేశారు. భార‌త్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశాల్లో ర‌ష్యా అగ్ర‌స్థానంలో ఉన్న‌ది. న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరైన్‌ను కూడా ఆ దేశం మ‌న‌కు లీజుకు ఇచ్చింది. ఏకే203 కొత్త త‌రహా రైఫిల్‌ను త‌యారు చేసేందుకు రెండు దేశాలు అంగీకారం కూడా తెలిపాయి. సైనిక ద‌ళాల‌కు ఏకే203 మోస్ట్ అడ్వాన్స్‌డ్ వెప‌న్‌గా ప‌నికివ‌స్తుంది. logo