మంగళవారం 22 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 10:07:52

లైటింగ్ సిస్ట‌మ్.. బ్రేకింగ్ కండిష‌న్‌ స‌రిగా లేక‌పోతే..

లైటింగ్ సిస్ట‌మ్.. బ్రేకింగ్ కండిష‌న్‌ స‌రిగా లేక‌పోతే..

హైద‌రాబాద్‌:  కేర‌ళ‌లోని క‌రిపుర్ విమానాశ్ర‌యంలో జ‌రిగిన విమాన దుర్ఘ‌ట‌న‌పై కొంద‌రు పైల‌ట్లు స్పందించారు. ఆ విమానాశ్ర‌యంలో ర‌న్‌వేపై లైటింగ్ సిస్ట‌మ్ స‌రిగా లేన‌ట్లు పేర్కొన్నారు.  ఇక వ‌ర్షాల స‌మ‌యంలో బ్రేకింగ్ కండిష‌న్‌ను స‌రిగా ప‌రిశీలించ‌ని కార‌ణంగా విషాదం జ‌రిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ర‌న్‌వేపై లైటింగ్ వ్య‌వ‌స్థ స‌రిగా లేని కార‌ణంగా అనేక సార్లు క‌రిపుర్ విమానాశ్ర‌యంలో విమానాల‌ను దింపేందుకు ఇబ్బంది ప‌డిన‌ట్లు కొంద‌రు పైల‌ట్లు చెప్పారు. శుక్ర‌వారం రాత్రి వ‌ర్షం, ఈదురుగాలులు ఎక్క‌వ‌గా ఉన్న కార‌ణంగా.. అలాంటి వాతావ‌ర‌ణంలో విమానాన్ని ల్యాండ్ చేయ‌డం కొంత ఇబ్బందిగానే ఉంటుందంటున్నారు. 

ఒక‌వేళ విమానం క‌నీసం 200 ఫీట్ల ఎత్తులో ఉన్న‌ప్పుడు..  పైల‌ట్ క‌నీసం ర‌న్‌వేపై ఒక్క లైట్‌నైనా చూడాలి. ఆ గైడెన్స్ లైట్ ఆధారంగానే పైల‌ట్లు విమానాన్ని దించుతుంటారు.  ఆ విధ‌రంగా చూస్తే కోజికోడ్ విమానాశ్ర‌యంలో లైటింగ్ వ్య‌వ‌స్థ మ‌రీ దారుణంగా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  ఇటీవ‌ల పైల‌ట్లు చేసిన ఫిర్యాదు మేర‌కు క‌రిపుర్ విమానాశ్ర‌యంలో రెండు లైట్ల‌ను ఏర్పాటు చేశార‌ని,  ఆ లైట్ల వ‌ద్దే ల్యాండింగ్ ప్రారంభం అవుతుంద‌ని, కానీ ఆ లైట్లు స‌రిగా లేవ‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 

లైటింగ్ స‌రిగా లేన‌ప్పుడు.. ఆ ర‌న్‌వేను పైల‌ట్లు బ్లాక్‌హోల్‌గా పిలుస్తుంటారు. అలాంటి ప్ర‌మాద‌క‌ర ర‌న్‌వేల‌పై విమానాన్ని దించ‌డం మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మే అవుతుంది.  లైటింగ్ వ్య‌వ‌స్థ స‌రిగా లేన‌ప్పుడు విమ‌నాన్ని దించే అంశంలో తిక‌మ‌క ఏర్ప‌డుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఇక ర‌న్‌వే బ్రేకింగ్ కండిష‌న్ రిపోర్ట్ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పైల‌ట్ కు చేర‌వేయాలి.  ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల‌ర్ ర‌న్‌వే ప‌రిస్థితి గురించి పైల‌ట్‌కు స‌మాచారం ఇవ్వాలి. అలా చేస్తే అప్పుడు ఆ పైల‌ట్ విమానాన్ని దించాలా వ‌ద్దా అన్న నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉంటాయి.  బ్రేకింగ్ కండిష‌న్ రిపోర్ట్ వ‌ల్ల ర‌న్‌వే ఉప‌రిత‌లం ఎలా ఉందో తెలుస్తుంది. సాధార‌ణంగా విమానాలు లైండ్ అయిన స‌మ‌యంలో కొంత ర‌బ్బ‌ర్ ర‌న్‌వేల‌కు అతుక్కుంటుంది.  ఇక వ‌ర్షాల స‌మ‌యంలో ర‌న్‌వేపై ఆ ర‌బ్బ‌ర్లు మ‌రింత జారుడుగా మారుతాయి. అలాంటి సంద‌ర్భాల్లోనే విమానాలు జారిప‌డే అవ‌కాశాలు ఉంటాయ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

క‌రిపుర్ ఘ‌ట‌న విష‌యంలో పైల‌ట్‌కు బ్రేకింగ్ కండిష‌న్ రిపోర్ట్ ఇచ్చి ఉండ‌ర‌ని కొంద‌రు పైల‌ట్లు భావిస్తున్నారు. బ్రేకింగ్ కండిష‌న్ స‌రిగా లేకుంటే, ఎవ‌రు కూడా ఆ ర‌న్‌వేపై విమానాన్ని దించేందుకు ఇష్ట‌ప‌డ‌రు. స‌రైన రీతిలో వార్నింగ్ ఇచ్చి ఉంటే .. కోజికోడ్ విషాదాన్ని పైల‌ట్ త‌ప్పించేవాడ‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. క‌రిపుర్ విమాన దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 18 మంది మ‌ర‌ణించారు.  రెండుగా ముక్క‌లైన ఎయిర్ ఇండియా విమానంలో 184 మంది ప్యాసింజెర్లు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.  174 మందిని వివిధ ఆస్ప‌త్రుల్లో చేర్పించారు.


logo