ఆదివారం 31 మే 2020
National - May 18, 2020 , 20:09:36

ఎక్కువ విమానాలను నడపండి

ఎక్కువ విమానాలను నడపండి

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన తమను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎక్కువ సంఖ్యలో విమానాలను నడపాలని భారతీయ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఉన్న హ్యూస్టన్‌, డల్లాస్‌ నగరాల్లో మరిన్ని డిపార్చర్‌ కేంద్రాలను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం హ్యూస్టన్‌లోనే దాదాపు 30 వేల మంది భారతీయులు ఇండియాకు రావడానికి ఎదురు చూస్తున్నారు. 

అమెరికాలో లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు, ఎమర్జెన్సీ మెడికల్‌ టూరిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఇండియన్లను వెనక్కు పంపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నది. కాన్సులేట్‌ హెల్ప్‌లైన్‌కు రోజుకు దాదాపు 10 వేల దాకా ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయి. వేలాది మంది భారతీయులు తమను ఇండియాకు పంపించాలని పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ‘వందే భారత్‌ మిషన్‌' మొదటి దశలో భాగంగా కేంద్రం ఇప్పటికే కొంత మందిని ప్రత్యేక విమాన సర్వీసుల ద్వారా ఇండియాకు రప్పించింది.


logo