శనివారం 28 మార్చి 2020
National - Feb 22, 2020 , 11:58:11

అన్ని న్యాయ సంస్కృతుల‌ను ఆద‌రించాం : చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

అన్ని న్యాయ సంస్కృతుల‌ను ఆద‌రించాం :  చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

హైద‌రాబాద్‌:  ఢిల్లీలో ఇంట‌ర్నేష‌న‌ల్ జ్యుడిషియ‌ల్ కాన్ఫ‌రెన్స్ జ‌రుగుతున్న‌ది.  ఆ స‌ద‌స్సులో చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే మాట్లాడారు.  అనేక సంస్కృతులు, సాంప్ర‌దాయాల‌కు ఇండియా నిల‌యంగా మారింద‌న్నారు. ఆ కోవ‌లోనే భార‌తీయ న్యాయ‌వ్య‌వ‌స్థ కూడా రూపాంతరం చెందిన‌ట్లు చెప్పారు.  మ‌న దేశానికి వ‌చ్చిన ప్ర‌తి నాగ‌రిక స‌మాజానికి చెందిన న్యాయ సాంప్ర‌దాయాల‌ను స్వాగ‌తించామ‌ని సీజే బోబ్డే తెలిపారు.  సుప్రీం తీసుకునే నిర్ణ‌యాలు ప్ర‌తి ఒక‌రి జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు.  రాజ్యాంగంలోని ప్రాథ‌మిక విధుల‌ను మ‌నం నిర్ల‌క్ష్యం చేస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు.  మ‌న విధుల‌ను మ‌నం స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తే, అప్పుడు అన్ని హ‌క్కుల‌ను అమ‌లు చేయ‌డం సులువు అవుతుంద‌న్న మ‌హాత్మాగాంధీ బోధ‌న‌ల‌ను బోబ్డే గుర్తు చేశారు. స‌వాళ్ల‌ను న్యాయ‌వ్య‌వ‌స్థ ఎంత స‌మ‌ర్థంగా ఎదుర్కొంటే..  ఆ చ‌ట్టాల అమ‌లులో విజ‌యం అంత‌గా ఉంటుంద‌ని సీజే అన్నారు. 

 


logo