గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 17:46:33

అఫ్ఘాన్‌కు భార‌త రాయ‌బారిగా రుద్రేంద్ర

అఫ్ఘాన్‌కు భార‌త రాయ‌బారిగా రుద్రేంద్ర

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌కు భార‌త త‌దుప‌రి రాయ‌బారిగా రుద్రేంద్ర టాండ‌న్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు భార‌త విదేశాంగ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రుద్రేంద్ర టాండన్ 1994 బ్యాచ్‌కు చెందిన ఫారెన్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఆయ‌న అసోసియేష‌న్ ఆఫ్‌‌ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఏఎస్ఈఏఎన్)కు భారత రాయబారిగా సేవలు అందిస్తున్నారు. కాగా, టాండాన్ త్వరలోనే నూత‌న‌ బాధ్యతలు చేపడుతారని విదేశాంగ‌శాఖ వెల్ల‌డించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo