బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 28, 2020 , 15:49:04

ఆరోగ్య‌సేతు యాప్‌ను క్రియేట్ చేసిందెవ‌రు ?

ఆరోగ్య‌సేతు యాప్‌ను క్రియేట్ చేసిందెవ‌రు ?

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం త‌మ స్మార్ట్‌ఫోన్ల‌లో ఆరోగ్య‌సేతు యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ యాప్‌ను ఎవ‌రు డిజైన్ చేశార‌న్న దానిపై  ప్ర‌భుత్వం ఇచ్చిన వివ‌ర‌ణ ప‌ట్ల సెంట్ర‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఆరోగ్య‌సేతు యాప్‌ను నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మేటిక్స్ సెంట‌ర్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు వెబ్‌సైట్‌లో ఉన్నా.. ఆర్టీఐ వేసిన ప్ర‌శ్న‌కు మాత్రం ఇద్ద‌రూ స‌మాధానం ఇచ్చేందుకు నిరాక‌రించారు. ప్ర‌భుత్వ విభాగాలు ఇచ్చిన సమాధానాలు త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ఉన్న‌ట్లు సెంట్ర‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్ త‌న నోటీసుల్లో పేర్కొన్న‌ది. అధికారులు స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డాన్ని అంగీక‌రించ‌లేమ‌ని ఆర్టీఐ త‌న నోటీసులో పేర్కొన్న‌ది. యాప్‌ను ఎవ‌రు క్రియేట్ చేశారు, వాటి ఫైల్స్ ఎక్క‌డ ఉన్నాయి లాంటి అంశాల‌పై చీఫ్ ప‌బ్లిక్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఆఫీస‌ర్లు వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోయిన‌ట్లు సీఐసీ చెప్పింది.   న‌వంబ‌ర్ 24వ తేదీన క‌మిష‌న్ ముందు హాజ‌రుకావాలంటూ ఆయా శాఖ‌ల‌కు ఆదేశాలు జారీ చేశారు.  యాప్‌కు సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించేందుకు ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు కార్య‌క‌ర్త సౌర‌వ్ దాస్ ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. యాప్ త‌యారీకి సంబంధించిన‌ మొత్తం ఫైళ్లు త‌మ ద‌గ్గ‌ర లేవ‌ని నేష‌న‌ల్ ఇన్ఫ‌ర్మాటిక్స్ సెంట‌ర్ పేర్కొన్న‌ది.