శుక్రవారం 15 జనవరి 2021
National - Dec 20, 2020 , 02:02:50

ఆరెస్సెస్‌ సీనియర్‌ నేత ఎంజీ వైద్య మృతి

ఆరెస్సెస్‌ సీనియర్‌ నేత ఎంజీ వైద్య మృతి

నాగ్‌పూర్‌: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) సిద్దాంతకర్త, ఆ సంస్థ తొలి అధికార ప్రతినిధి మాధవ్‌ గోవింద్‌ వైద్య (97)శనివారం కన్నుమూశారు.  కరోనా నుంచి కోలుకున్న ఆయన.. కొద్ది రోజుల కిందట తిరిగి అస్వస్థతకు గురయ్యారు. నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేటు దవాఖానాలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి పట్ల ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సంతాపం వ్యక్తం చేశారు.